KMR: మద్నూర్ కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) లో రేపటి నుంచి వరసగా నాలుగు రోజులు పాటు పత్తి కొనుగోలు బంద్ ఉండనున్నాయి. ఈ నెల 25, 26న క్రిస్మస్ సెలవులు, 27న శనివారం, 28న ఆదివారం యథావిధిగా బంద్ ఉంటుందని వ్యవసాయ మార్కెట్ శాఖ, సీసీఐ అధికారులు తెలిపారు. రైతులు గమనించి సీసీఐ కొనుగోలు కేంద్రానికి ఆ రోజుల్లో పత్తి తీసుకుని రావద్దని సూచించారు.