NZB: శ్రీరామ్‌సాగర్ నుంచి యాసంగి సీజన్‌కు నీటి విడుదలను అధికారులు బుధవారం ప్రారంభించారు. కాకతీయ, సరస్వతి కాలువకు నీటిని విడుదల చేశారు. ఎస్సారెస్పీ ఆయకట్టు కింద యాసంగి సాగు పనులు జోరందుకున్నాయి. దీంతో నీటి విడుదల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సమావేశం అయిన అధికారులు నీటి విడుదల ప్రణాళికను ఖరారు చేశారు.