ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో దర్శకుడు త్రివిక్రమ్ మరో సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్తో చేయనున్న మైథలాజికల్ సినిమాను ఇప్పుడు బన్నీతో చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే అల్లు అర్జున్తో చర్చలు జరపగా.. ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.