AP: బాహుబలి రాకెట్ విజయవంతం చేసిన ఇస్రో బృందానికి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. భారతదేశ వాణిజ్య ప్రయోగ సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంలో ఈ ప్రయోగం ఒక కీలక మైలురాయిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇస్రో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాక్షించారు.