NLG: దేవరకొండకు చెందిన ముస్లిం మత గురువు తయాబ్ ఖాసీం మృతి బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ఖాసీం మృతదేహం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మత గురువు తయాబ్ ఖాసీం మృతి ముస్లింలకు తీరని లోటు అని, మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.