గద్వాల జిల్లా మానవపాడు మండలం కలుకుంట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతు దేవన్న(63) గుండెపోటుతో మృతి చెందారు. పంట విక్రయానికి నాలుగు రోజులుగా ఎదురుచూస్తూ బుధవారం తూకం సమయంలో కుప్పకూలారు. తోటి రైతులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ధాన్యం రాశుల వద్దే ప్రాణాలు విడిచిన ఘటన స్థానికంగా అందరిలో విషాదం నింపింది.