ADB: సిరికొండ పంచాయతీ కార్యదర్శి పురుషోత్తం గ్రూప్-3 ఫలితాల్లో ప్రతిభ చాటి ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖలో సీనియర్ ఎడిటర్‌గా ఎంపికయ్యారు. విధులు నిర్వహిస్తూనే పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగం సాధించిన ఆయనను మండల యువత సన్మానించారు. సమయ పాలనతో కష్టపడితే విజయం సాధ్యమని పురుషోత్తం నిరూపించారని వారు కొనియాడారు.