VZM: దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన యూత్ ఏషియన్ పారా గేమ్స్ -2025 పోటీల్లో బాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్ సాధించిన జిల్లాకు చెందిన పారా క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్ చంద్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందించి, సత్కరించారు. బుధవారం మంత్రిని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వీ.రామస్వామి, అధ్యక్షులు కె. దయానంద్ మర్యాదపూర్వకంగా కలిసారు.