SKLM: శ్రీకాకుళం జీఆర్పీ పరిధిలోని రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. ఈరోజు తిరుచునాపల్లి నుండి హౌరా వెళ్లే ట్రైన్ వస్తున్న సమయంలో సదరు వ్యక్తి రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. వివరాలకు 9493474582, 9110305494 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.