TG: డీజీపీ శివధర్‌రెడ్డి నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరించింది. రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును UPSCకి పంపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ మేరకు ప్యానల్ లిస్టు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. UPSCకి ప్యానల్ లిస్టు పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 20కి వాయిదా వేసింది.