భారత మహిళల క్రికెట్ జట్టులో జెమీమా రోడ్రిగ్స్ కెరీర్ రెండు నెలలముందు అంత గొప్పగా ఏమీ లేదు. నిలకడ లేమితో జట్టులోకి వస్తూ పోతూ ఉండేది. కానీ, ఇప్పుడు ఆమె భారత జట్టు సూపర్ స్టార్లలో ఒకరిగా ఎదిగింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 30న ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో జెమీమా (127*) చెలరేగడంతో ఆమె పేరు మార్మోగింది. ప్రపంచకప్‌తో ఆమె ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.