ప్రముఖ మలయాళ దర్శకుడు, మాజీ MLA P.T కుంజు మహమ్మద్ అరెస్ట్ అయ్యారు. తనను మహమ్మద్ లైంగికంగా వేధించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కోసం సినిమాలను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఒక హోటల్లో బస చేసిన సమయంలో దర్శకుడు ఇబ్బంది పెట్టారని పేర్కొంది. దీంతో పోలీసులు అతని అరెస్ట్ చేసి.. ఆ తర్వాత బెయిల్పై విడుదల చేశారు.