AP: వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారని, జనసేన లేదా బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని ఆమె స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక.. ప్రజల్లో తనకున్న ఆదరణను చూసి ఇలాంటి అసత్య వార్తలు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. తనపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నవారే రేపు ప్రజల ముందు నవ్వులపాలవుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.