GNTR: తెనాలి వైకుంటపురం క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు ఇవాళ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారు శ్రీ వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష అలంకరణలో ఉన్న స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.