SRD: రిటైర్మెంట్ బకాయిలు ఏకకాలంలో చెల్లించాలని కోరుతూ.. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుణ సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం నిరాహార దీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెన్షన్ దారులు మాట్లాడుతూ.. బకాయిలు చెల్లించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.