GDWL: కేటీదొడ్డి మండలంలోని నందిన్నె గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. సర్పంచ్ బోయ నాగమ్మ వెంకటేష్, ఉప సర్పంచ్ పుష్పలత పాల్గొన్నారు. సొంత ఇంటి కల నెరవేరుతుండటంతో లబ్ధిదారులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.