MBNR: జిల్లా కేంద్రంలోని పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతికతపై పట్టు సాధించాలని, వారి ఉజ్వల భవిష్యత్తే దేశ ప్రగతికి మూలమని ఆయన అన్నారు. విద్యార్థుల ఉన్నతికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.