NLG: దేవరకొండలోని డిండి రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్డు భవనాల అధికారికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. మీనాక్షి సెంటర్ నుంచి మైనంపల్లి బ్రిడ్జి వరకు రోడ్డు భవనాల శాఖ రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయలేక పోవడం వల్ల అక్కడ నుంచి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు.