E.G: రాజమండ్రి రూరల్ 3వ మండలం బీజేపీ కార్యవర్గ సమావేశం ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం వద్ద బుధవారం జరిగింది. ఈ సమావేశంలో రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.