SRD: భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ జయంతిని పురస్కరించుకొని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, దీపాలను వెలిగిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. వాజపేయి విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా నిలిచారన్నారు.