సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూర్ గ్రామానికి చెందిన జక్కు చందు మెరైన్ కమాండో ఫోర్స్ (MARCOS)లో కమాండోగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ.. ఈ కమాండో దేశంలోనే అత్యంత కఠినమైందని, 8 నెలల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, యువత చందును అభినందిస్తూ కొనియాడారు.