NLG: జిల్లా పోలీసు శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజల భద్రత, మహిళలు–పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మత్తు పదార్థాల నిర్మూలన, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 2024తో పోలిస్తే 2025లో మొత్తం నేరాలు, తీవ్ర నేరాలు తగ్గాయని వార్షిక నివేదికను తెలిపారు.