E.G: రూడా ఛైర్మన్, తూ.గో జిల్లా TDP అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి బుధవారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలు, పురుషోత్తంపట్నం రైతుల సమస్యలు, సాగునీటి సదుపాయాలు, తదితర అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.