ELR: పోలీస్ స్పోర్ట్స్ మీట్ 25 కార్యక్రమం మంగళవారం రాత్రి ముగిసింది. ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ టీం క్రికెట్ ఫైనల్స్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. సబ్ డివిజన్లో పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్, క్రికెట్, హై జంప్, బ్యాట్మెంటన్, షార్ట్ పుట్, వంటి ఆటలలో పురుష, మహిళా పోలీసు క్రీడాకారులు పతకాలు సాధించారు. బుధవారం డీఎస్పీ శ్రావణ్ కుమార్ వీరిని అభినందించారు.