AP: ఇప్పటివరకు సినిమా బడ్జెట్ ప్రకారం టికెట్లు పెంచినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇకపై బడ్జెట్ ప్రకారం కాకుండా ఓ కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ‘అన్నింటికీ కేటగిరీ ప్రకారం సమానంగా టికెట్ రేట్లు పెంచే విధానాన్ని పరిశీలిస్తున్నాం. బడ్జెట్, హై బడ్జెట్ సినిమాలకు ఎంత ధరలు నిర్ణయించాలనే విషయమై కమిటీ చర్చిస్తోంది’ అని వెల్లడించారు.