NLR: పార్లమెంటరీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్రను ఇవాళ రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మాగుంట లేఔట్‌లోని బీద నివాసానికి వెళ్లి శాలువాతో ఘనంగా సత్కరించారు. పార్టీ బలోపేతం కోసం తీసుకునే నిర్ణయాలకు సహకరిస్తానని కోటంరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో పార్టీ స్థితిగతుల గురించి వివరించారు.