ఢిల్లీలో వాయు కాలుష్యంపై అక్కడి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీ ఉండటమేంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అందాలని తెలిపింది. అది చేయలేనప్పుడు కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించలేరా అని నిలదీసింది.