SRD: సిర్గాపూర్ మండలం పెద్ద ముబారక్పూర్ గ్రామ నూతన సర్పంచ్ పద్మ విట్టల్ బుధవారం ఖేడ్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని కలిశారు. అదే విధంగా ఖేడ్ మండలం కొండాపూర్ తాండ ఉపసర్పంచ్ ప్రేమ్ సింగ్, వార్డు సభ్యులు పాంగ్ బాయి, గోవింద్ లకు మాజీ ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.