ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లోని పోలీస్ సంక్షేమ ఉన్నత పాఠశాల (శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్)లో బుధవారం ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. స్కూల్ ఛైర్ పర్సన్ నిష్టాశర్మ విద్యార్థులకు ఏసుక్రీస్తు జన్మదిన ప్రాముఖ్యతను, శాంతి సందేశాన్ని విద్యార్ధులకు తెలియజేశారు. చిన్నారులు శాంటా క్లాజ్, దేవదూతల వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు.