అన్నమయ్య: ఎమ్మెల్యే షాజహాన్ భాష మదనపల్లె మండలం చీకిల బైలు సచివాలయాన్ని ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.