ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో MLA కోవ లక్ష్మి బుధవారం భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి ఇరుముడిని ధరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం “స్వామియే శరణం అయ్యప్ప” అనే నామస్మరణతో మారుమోగింది. ఇరుముడి ధరించిన అనంతరం MLA, ఇతర స్వాముల బృందం కలిసి శబరిమల యాత్రకు బయలుదేరి వెళ్లారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని MLA కోరుకున్నారు.