NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల సాగు కోసం బుధవారం లక్ష్మీ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గేట్లు ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎస్సారెస్పీ సూపరింటెండింగ్ ఇంజినీర్ వి.జగదీష్ మాట్లాడుతూ.. ‘సివామ్’ (SCIWAM) కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయకట్టుకు వారాబంది పద్ధతిలో నీటి సరఫరా ఉంటుందని తెలిపారు.