TG: రెండేళ్ల తర్వాత వచ్చేది BRS ప్రభుత్వమే అని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లకు మించి ఉండదు. మా ప్రభుత్వం వచ్చాక వేధించిన వారి అంతూచూస్తాం. మా హయాంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం. ఈ ప్రభుత్వం హయాంలో పిల్లల చదువులు, పథకాలన్నీ ఆగమాగం. అందాల పోటీలు, ఫుట్బాల్ ఆటతో ప్రజలకు ఒరిగేదేంటి?’ అని ప్రశ్నించారు.