MBNR: మాజీ కేంద్రమంత్రి మల్లికార్జున్ చేసిన సేవలు ఎనలేనివని మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. మల్లికార్జున్ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనలో మల్లికార్జున్ ఎంతో క్రియాశీలంగా పనిచేశారన్నారు.