AP: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతంపై మాజీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు తెలిపారు. ‘ఇస్రో శాస్త్రవేత్తలు శాటిలైట్‌ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చడం మన శాస్త్రీయ నైపుణ్యానికి నిదర్శనం. దేశానికి స్ఫూర్తినిస్తూ నిరంతరం కృషి చేస్తున్న ఇంజినీర్లకు అభినందనలు’ అని Xలో పోస్ట్ చేశారు.