ADB: నార్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామంలో బుధవారం 1150 పశువులకు డీవార్మింగ్ చేసినట్లు వెటర్నరీ ప్రాక్టీషనర్ మస్కే సునీల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నట్టల నివారణ శిభిరం సందర్బంగా మేకలు, గొర్రెలకు ఉచితంగా డీవార్మింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు జరిగే శిభిరాన్ని సద్వినియోగం చేయాలన్నారు.