VSP: శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్.మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం తర్వాత వేద ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.