MDK: క్రిస్మస్ వేడుకల సందర్భంగా మెదక్ చర్చి వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును బుధవారం డీఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సుమారు 500 మంది పోలీస్ సిబ్బందితో నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.