విజయనగరంలోని స్థానిక వేణుగోపాలపురం ప్రభుత్వ డైట్ కళాశాల విద్యార్థి కూనేటి మహేష్ (24) ఆత్మహత్య చేసుకున్నాడు. సెకండ్ ఇయర్ చదువుతున్న మహేష్ కళాశాల సమీపంలో ఉన్న వసతిగృహంలో మంగళవారం అర్ధరాత్రి ఉరి వేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై అశోక్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.