అనకాపల్లి మండలానికి చెందిన 43 మందికి సీఎం సహాయనిధి చెక్కులను నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు బుధవారం పంపిణీ చేశారు. సీహెచ్ఎన్ అగ్రహారం, రేబాక, గోపాలపురం, కాపుశెట్టివానిపాలెం, తదితర గ్రామాలకు ఆయన స్వయంగా వెళ్లి చెక్కులను అందజేశారు. రూ.22.54 లక్షలు CMRF చెక్కులు మంజూరైనట్లు పేర్కొన్నారు.