బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.925కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మరికొన్ని రోజుల్లో ఇది రూ.1000 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇదే హవా కొనసాగితే ఈ సినిమా ‘జవాన్’, ‘పఠాన్’, ‘కల్కి’ రికార్డులను బ్రేక్ చేస్తుందని పేర్కొన్నాయి.