విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో బీహార్ రికార్డు పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 574/6 పరుగులు చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక స్కోరు ఇది. షకిబుల్ గని(128*), వైభవ్ సూర్యవంశీ 190, ఆయుష్ లోహారుక 116 సెంచరీలతో అదరగొట్టారు. అరుణాచల్ బౌలర్లలో మోహిత్, నెరి చెరో 2 వికెట్లు పడగొట్టారు.