AP: గుంటూరు జిల్లా ఇప్పటంలోని వృద్ధురాలు నాగేశ్వరమ్మ ఇంటికి Dy. CM పవన్ కళ్యాణ్ వెళ్లారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లు, ప్రహరీలు తొలగించారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారని ఇళ్లను కూల్చివేశారు. అప్పట్లో పవన్ పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని నాగేశ్వరమ్మ కోరడంతో.. ఇచ్చిన మాట ప్రకారం పవన్ అక్కడికి వెళ్లారు.