భారతీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ 3 వీలర్ యోధ ట్రెవో విడుదలైంది. వస్తువుల డెలివరీ, సరుకు రవాణాకు రూపొందించారు. దీని ధర రూ.4.35 లక్షల నుంచి రూ.4.75 లక్షల వరకు ఉంటుంది. ఇది 11.8 kWh ఫిక్స్డ్ బ్యాటరీ, 7.6 kWh స్వాపబుల్ బ్యాటరీతో వస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో 130-150 KM వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుంది.