NLG: చిట్యాల మండలం వెలిమినేడు పంచాయతీ కార్యదర్శి తాటికొండ లింగస్వామి కలెక్టర్ ఇలా త్రిపాఠి నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. ఎన్నికల విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీ కార్యదర్శులను మండలానికి ఒకరిని జిల్లా అధికారులు ఎంపిక చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన ప్రశంసా పత్రం అందుకున్నారు. పాలకవర్గం బుధవారం ఆయనకు అభినందనలు తెలిపారు.