TG: మేడారంలో పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలు రహస్యంగా నిర్వహిస్తారని, మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని ఆలయ పూజారులు వెల్లడించారు. కాగా, జనవరి చివరి వారంలో మహా జాతర ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.