NLR: సీతారామపురం (M) గుండుపల్లి ఎస్సీ కాలనీ వద్ద హైవేపై స్థానికులు ఆందోళన చేపట్టారు. నూతనంగా నిర్మించనున్న మైదుకూరు-సింగరాయకొండ 167 B హైవేపై బస్సు షెల్టర్, విద్యుత్త్ లైట్లు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో బస్ షెల్టర్ లేకపోవడం, రాత్రి వేళలో లైట్లు లేకపోవడంతో ఇబ్బందులు గురవుతున్నామని వారు పేర్కొన్నారు.