PLD: పెదకూరపాడులో లగడపాడు రోడ్డులో గల శివాలయం వద్ద నిలిచిపోయిన మురుగునీటిని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు.సైడ్ కాలువల్లో పేరుకుపోయిన పూడికను తీసివేసి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. స్థానికులు కాలువలు మూసివేయడం వల్లే మురుగు రోడ్డుపైకి ప్రవహిస్తోందని గుర్తించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని EO అన్నారు.