అమెరికాలో వలసదారుల పిల్లలపై ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ విషం కక్కారు. 70 ఏళ్లుగా వలసదారులకు పుట్టిన మిలియన్ల మంది పిల్లలు అమెరికాకు చేసింది తక్కువే అని వ్యాఖ్యానించారు. సోమాలియా వలసదారులను ఉదాహరణగా చూపుతూ అందరిపై మాట్లాడారు. ఫాక్స్ న్యూస్లో ఇంటర్వ్యూలో మిల్లర్ ఈ వ్యాఖ్యలు చేశారు.