శ్రీహరికోట నుంచి LVM3-M6 (బాహుబలి) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్-2ను ఇది మోసుకెళ్లింది. ఉపగ్రహం బరువు సుమారు 6,100 కిలోలు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.